పెళ్లి బరాత్లో డాన్స్ చేయవద్దని భార్య వారించడంతో మనస్థాపానికి గురైన భర్త ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన నిజాంసాగర్ మండలం ఆరెపల్లి జరిగింది. ఆరేపల్లి గ్రామానికి చెందిన అనిల్ (28) బంధువుల పెళ్లి ఉండడంతో భార్య స్వప్న తో కలసి స్వగ్రామానికి వచ్చాడు వివాహ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం వివాహం అనంతరం రాత్రి జరిగే బరాత్ లో అనిల్ డాన్స్ చేయడానికి సిద్ధం అయ్యాడు.
కానీ భార్య డ్యాన్స్ వద్దని వారించింది దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన అనిల్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు అదే రాత్రి ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి,రెండు సంవత్సరాల కుమారుడు భార్గవ్ ఉన్నారు
. మృతుని తండ్రి చెన్నబోయిన లచ్చయ్య ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.మృతుడు హైదారాబాద్ లో వుంటున్నాడు.