భానుడి ప్రతాపం తో ప్రధాన పార్టీ అభ్యర్థులు దూకుడు తగ్గించారు. ఎండ వేడి తాళలేక పగటి పూట ప్రచారానికి జంకుతున్నారు. ఎలాగో పోలింగ్ ఇంకా నెలరోజుల గడువు వుండడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచడానికి ఆసక్తి చూపడంలేదు. తీవ్రమైన ఎండలకు తోడు ఇప్ప్పుడే దూకుడుగా వెళ్తే ప్రచార ఖర్చులు మోయలేని భారం అవుతాయనే ఆలోచనతో ముందుకు కదులుతున్నారు. లోకసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చి దాదాపు 20 రోజులు కావస్తుంది. అయినప్పటికి ప్రధాన పార్టీలు ప్రచారం ఉదృతం చేయలేక పోతున్నాయి.
బీజేపీ బిఆర్ యస్ కాంగ్రెస్ పార్టీలు ఈ పార్టీకే అభ్యర్థులను ఖరారు కూడా చేసాయి.బీజేపీ అభ్యర్థి అర్వింద్ సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయన షెడ్యూల్ కు ముందే నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగేశారు.ప్రధాని మోడీ సైతం జగిత్యాల్ కేంద్రంగా నిజామాబాద్ లోకసభ ఎన్నికల శంఖారావం పూరించారు. మరో వైపు అర్వింద్ అసెంబ్లీ సెగ్మెంట్ కార్యకర్తల సమావేశాలు పూర్తిచేసి క్యాడర్ లో ఉత్తేజం కలిగించారు. కానీ బిఆర్ యస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఖరారు చేయడంలో సుదీర్ఘ కసరత్తులు చేసాయి. ఈలోపు ఎండలు తీవ్రం అయ్యాయి.
దీనితో సెగ్మెంట్ వారీగా లోకసభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించ లేక పోయారు. బిఆర్ యస్ అభ్యర్థి గోవర్ధన్ నాలుగు సెగ్మెంట్ సమావేశాలకు హాజరు అయ్యారు.కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఒక్క సెగ్మెంట్ లోను సన్నాహక సమావేశాలు నిర్వహించలేక పోయారు. ప్రచారం ఉదృతం చేసే లోపే ఎండలు అభ్యర్థుల దూకుడు కు కళ్లెం వేసాయి. అదికూడా జిల్లాలో ఉష్ణోగ్రత లు 40 డిగ్రీలు దాటేస్తుంది. అందుకే క్యాడర్ సంగతి దేవుడెరుగు అభ్యర్థులే బయటికి వెళ్ళడానికి జంకుతున్నారు. పోలింగ్ కు ఇంకా నెల రోజులు గడువు ఉంది.
రాబోయే రోజుల్లో ప్రచారం మరింత ఉదృతంగా సాగాలంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనతో అభ్యర్థులున్నారు. ఎలాగో పగలు బయటికి వెళ్ళాక పోయిన ఎన్నికల ప్రచారం లో అభ్యర్థులు వుంటున్నారు. కీలక వర్గాలతో భేటీ లు అవుతున్నారు. ముక్య నేతల ఇండ్లకు వెళ్ళి కాలక్షేపం చేసి వస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయాల్లోనే బయిటికి వచ్చి ప్రచారంలో కాసేపు సందడి చేసి వెళ్తున్నారు.
ఉగాది రంజాన్ పండగల తరవాతే ప్రచారం ఊపందుకునే అవకాశం వుందని బడా నేతలు సైతం ప్రచారం కోసం నోటిఫికేషన్ వచ్చాకే జిల్లాకు వస్తారని భావిస్తున్నారు. ఆలోపు ఎండల తీవ్రత తగ్గుతుందనే అంచనాల్లో అభ్యర్థులున్నారు