ఆర్మూర్ రైతుల అండతోనే ఎదిగా ఆర్మూర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి -ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు -ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాను-ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తా + జీవన్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించండిజన రమేష్ ఇది సంగతి ఆర్మూర్ 20201 లో ఆర్మూర్ లో రైతు దీక్షతో తాను పిసిసి అధ్యక్షుడిని సీఎం అయ్యానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రోడ్డు షోలో పాల్గొనడానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో వచ్చిన ఆయన ఆర్మూర్ గోల్ బంగ్లా మీదుగా రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేస్తూ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న సీసా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఉత్సాహంగా కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి 16 కోట్లతో నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
2014 ఎన్నికల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చిన కవిత జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. నిజామాబాద్ ప్రజలను మోసం చేసిన కవితను గతపార్లమెంట్ ఎలక్షన్ లో 100 కు పైగా రైతులు నామినేషన్ వేసి చిత్తుగా ఓడించిన ఘనత ఆర్మూర్ రైతులకే దక్కుతుందన్నారు.
నిజామాబాద్ సమస్యల పరిష్కారం కావాలంటే ఎంపీగా జీవన్ రెడ్డి ని గెలిపించాలని అన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు వేసే బాధ్యత నాదేనని, లేదంటే ముక్కు నేలకు రాస్తానన్నారు. లేదంటే కెసిఆర్ ముక్కురో వస్తావా అంటూ సవాల్ విసిరారు.
సిద్దుల గుట్ట సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తానని మాట ఇస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
