Monday, June 16, 2025
HomeTelanganaNizamabadఅసెంబ్లీ ఎన్నికలో ఓడారు .....లోకసభ బరిలో దిగారు.......నిజామాబాద్ లో రసవత్తర పోరు

అసెంబ్లీ ఎన్నికలో ఓడారు …..లోకసభ బరిలో దిగారు…….నిజామాబాద్ లో రసవత్తర పోరు

నిజామాబాద్ లోకసభ స్థానంలో రసవత్తర పోరు జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడబోతున్నారు. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ బిఆర్ యస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు బుధవారమే ఖరారు అయ్యింది. ఈ ముగ్గురూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా వారే !బీజేపీ అభ్యర్థిఅర్వింద్ కోరుట్ల సెగ్మెంట్ లో పోటీచేయగా బిఆర్ యస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి బిఆర్ యస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఓడిపోయారు. బి ఆర్ యస్ అభ్యర్థి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పోటీచేశారు.కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈ ముగ్గురు నేతలు అదే పార్టీ అభ్యర్థులుగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తుడడం ఆసక్తిగా మారింది ఇందులో అర్వింద్ బీజేపీ అభ్యర్థి ఎంపీ ఎన్నికల్లో రెండో సారి పోటీ చేస్తుండగా జీవన్ రెడ్డి మూడో సారి పోటీచేస్తుంటే గోవర్ధన్ మాత్రం మొదటి సారి పోటీ చేస్తున్నారు.కాని అర్వింద్ ఒక్కరే ఇప్పటిదాకా పరాజయం చూడలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. దాదాపు సమాన ఫలితాలు సాధించాయి. లోకసభ పరిధి లో ఏడు సెగ్మెంట్ లుంటే బిఆర్ యస్ మూడు స్థానాలు బాల్కొండ కోరుట్ల జగిత్యాల్ సెగ్మెంట్ లు గెలిచింది. ఈ మూడు నియోజకవర్గాలను కంచుకోటగా చేసుకుంది. బీజేపీ రెండు స్థానాలు ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లు గెలిచింది. భారీ మెజార్టీ తో గెలిచింది. ఈ రెండు సెగ్మెంట్ లలో బిఆర్ యస్ మూడో స్థానం లో కి వెళ్ళింది. బోధన్ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లను గెలిచిన కాంగ్రెస్ మిగితా సెగ్మెంట్ లలో భారీగా వోట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో ఆధిపత్యం కోసం మూడు ప్రధాన పార్టీలు మరోసారి హోరాహోరీగా తలపడే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ప్రధాని మోడీ ఈపాటికే జగిత్యాల్ జిల్లాకేంద్రంలో ఎన్నికల శంఖారావం పూరించివెళ్లారు. ఎంపీ అర్వింద్ ప్రచారంలో ప్రత్యర్థుల కన్న ముందున్నారు. ఆయా కులసంఘాల పెద్దలందరితో మమేకం అయ్యారు. మోడీ మానియా ….. పసుపు బోర్డు అంశాలు ఈసారి ఎన్నికల్లో గట్టెక్కిస్తాయనే ధీమాతో అర్వింద్ ఉన్నారు. ఈసారి షుగ ఫ్యాకర్టీ హామీతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు మరో వైపు కరీం నగర్ నుంచి రెండు సార్లు ఎంపీ పోటీ చేసిన జీవన్ రెడ్డి ఈసారి నిజామాబాద్ స్థానంకు మారారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వఅమలు చేస్తున్న పథకాలు తనను సులువుగా గట్టెక్కిస్తాయనే భరోసా తో ఉన్నారు.మొదటి సారిగా ఎంపీ బరిలో దిగిన బిఆర్ యస్ అభ్యర్థి గోవర్ధన్ క్షేత్ర స్థాయిలో పార్టీక్యాడర్ ఇంకా క్రియాశీలకంగా ఉన్నారు వారు గట్టిగా పనిచేస్తే సులువుగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే లతో సమన్వయం చేసుకొని సానుకూల ఫలితాలు సాధించే వ్యూహంలో ఉన్నారు.అయితే మాజీ ఎమ్మెల్యే లు ఏ మేరకు క్రియాశీలకంగా పనిచేస్తారనేది చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!