మానవ రక్షణ కోసమే… సిలువ బలియాగం- జిల్లా వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు- చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు- ఏసుప్రభు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించి న క్రైస్తవులు
జానా రమేష్: ఇది సంగతి :ఆర్మూర్:
ప్రేమ, క్షమాపణలకు ప్రతికగా నిలిచే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు మరణ దినాన్ని స్మరిస్తూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని క్రైస్తవ ప్రార్థన మందిరాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకుంటున్నారు.గుడ్ ఫ్రైడే అనేది విషాదకరమైన రోజు.
యేసుక్రీస్తు శిలువ వేయబడిన జ్ఞాపకార్థం, జీసెస్ ప్రజల పాపాల కోసం అంతిమ త్యాగం చేశాడని క్రైస్తవులు విశ్వసిస్తారు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. గుడ్ ఫ్రైడే అని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది.
ఏసు ప్రభువు మానవజాతి మేలు కోసం ఇదే రోజున తన ప్రాణాలను త్యాగం చేశారని క్రైస్తవులు నమ్ముతారు.క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే కి ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారో తెలుసా? అందరితోటి ప్రేమగా ఉండి త్యాగం చేసినట్లయితే మళ్లీ మంచి జీవితం వస్తుందని భావిస్తున్నారు.
నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ డివిజన్లో అన్ని క్రైస్తవ మందిరాలలో క్రైస్తవులు పెద్ద ఎత్తున గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొని క్రీస్తు మరణాన్ని స్మరించారు. ఆయా స్థలాల్లో క్రీస్తు మరణం ఇతివృత్తాంత నాటికలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జెకర్యా ఆనంద్ మాట్లాడుతూ…ఏసు ప్రభువు మానవజాతి మేలు కోసం ఇదే రోజున తన ప్రాణాలను త్యాగం చేశారని వివరించారు.ఈ రోజు మానవజాతి అన్ని పాపాలకు క్షమాపణను సూచిస్తుందని, లోక రక్షకుడిగా పేరొందిన ఏసు ప్రభువు తన ప్రజల ఆత్మలు రక్షణ కోసం ప్రాణాలను సైతం విడిచారని పేర్కొన్నారు.
అందుకే ఆ రోజును గుడ్ ఫ్రైడే , గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారని వివరించారు .గుడ్ ఫ్రైడే కి ముందు క్రైస్తవ సోదరులు 40 రోజులు ఉపవాస దీక్షలు చేస్తారు. వీరందరూ కూడా గుడ్ ఫ్రైడే రోజు ఉపవాస దీక్ష విరమించుకుంటారు. 40 రోజులపాటు ప్రజలతో రోజు మమేకమై యేసు ప్రార్థనలు చేస్తూ ఉంటారు.
40 రోజులపాటు తమ బంధుమిత్రులు స్నేహితులతో ప్రేమ అభిమానాలు పెంచుకుంటూ కలిసి ఉంటారు. 40 రోజుల తర్వాత దీక్షలు గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో దేశమంతా ప్రజలు బాగుండాలని ప్రార్థనలు చేయడం జరుగుతుంది అని తెలిపారు.



