నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పై నుంచి కింద పడి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన నిజామాబాద్ నగరంలోని సాయి నగర్ లో చోటు చేసుకుంది. 5వ టౌన్ పోలీస్ లా వివరాల ప్రకారం.
మంగళవారం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నూతనంగా నిర్మిస్తున్న 3 వ అంతస్తు భవనం పై నుంచి కింద పడి మృతి చెందారని తెలిపారు.
శ్రీనివాస్ ఇంధాల్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు అంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.