ఇంట్లో అద్దెకు వుంటూ నమ్మకస్తుడి ఆస్తి కోసం మరీ చివరి కి ఇంటి ఓనర్ నే హత్య చేసిన కేసు ను ఆర్మూర్ పోలీసులు ఛేదించారు.గత నెల 18 న ఆర్మూర్ లోని సంతోష్ నగర్ లో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడి ని పోలీసులుఅరెస్ట్ చేశారు .
ఆర్మూర్ సంతోష్ నగర్ లో నివాసం ఉండే రాసురి లాస్య @ నవనీత మర్చి 23 న పట్టపగలే దారుణ హత్య కు గురయ్యారు .కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోమకొండ మండలం యాడారం కు చెందిన అల్లెపు మల్లయ్య @ రాజు @ అల్లెపు పోసానిపల్లి చిన్న మల్లయ్యా ను అదుపులోకి తీసుకోని విచారించడం తో హత్య మిస్టరీ వీడింది. మల్లయ్య సుమారు ఏడు సంవత్సరాల క్రితం మృతురాలి ఇంట్లో కిరాయికి ఉండి వెళ్ళిపోయడు కానీ తరచూ వారి ఇంటికి వచ్చి పోతుండేవాడు.
ఈ క్రమంలో మృతురాలి ఒంటిపై గల బంగారు ఆభరణాలను చూసిన ఎలాగైనా చంపేసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దొంగిలించాలనే ఉద్దేశ్యంతో, తేదీ మర్చి 23 న మధ్యాహ్నం పూటలాస్య ఇంటికి వెళ్ళగా ఇంట్లో ఒంటరిగా ఉన్నది అదే అదునుగా భావించి ఆమె గొంతుపై ఇంట్లోనే గల కొడవలితో బలంగా పొడిచి చంపి, ఆమె మెడలోని బంగారు పూస్తేల త్రాడు, ఒక బంగారు చైను ఒక జత వెండి పట్ట గొలుసులను తీసుకోని వెళ్ళాడు .
CC కెమెరా పాత నేరస్థుల రికార్డుల ఆధారముగా ఈ నెల 18.న అతని ఇంటి వద్ద పట్టుకుని, అతన్ని విచారించగా తను చేసిన నేరమును ఒప్పుకున్నాడు. ఇతనిపై ఇదివరకే (3) దోపిడి హత్య కేసులు, (11) బందీ పోటు కేసులు ఉన్నట్లు వెల్లడి అయింది.