నగరంలోని 47వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి ఉల్లెంగ నాగరాజు తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు.
గురువారం నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. గతంలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ జనరల్ సెక్రెటరీగా సేవలు అందించిన నాగరాజు, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
47వ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రజా సేవలో ముందుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పి. ప్రదీప్, కిరణ్ తదితరులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగర నాయకులకు, 47వ డివిజన్ ప్రజలకు ఉల్లెంగ నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన కోరుకున్నారు.
