నిజామాబాద్ నగరం కు చెందిన భార్యాభర్తలు కర్నాటక లో ఆత్మ హత్య చేసుకున్నారు. కర్నాటక లోని కొడుగు జిల్లా సోమవారు పేట లో ఓ లాడ్జి లో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే మృతులిద్దరూ నిజామాబాద్ నగరంలోని గాయిత్రి నగర్ ప్రాంతానికి చెందిన వారుగా సంఘటన స్థలంలో లభ్యం అయిన ఆధార్ కార్డు లో నిర్దారణ కు వచ్చారు. మృతుల్లో మేడవరపు రాజు ఆయన భార్య మేడవరపు స్వాతి గా గుర్తించారు.
వారిద్దరూ గతంలో గాయిత్రి నగర్ లో వుంటూ చుట్టుపక్కల అనేక మంది వద్ద భారీగా అప్పులు చేసారు. అప్పుల బాధ తాళ లేక నిజామాబాద్ నుంచి పారిపోయారు. చివరికి కర్నటక కు వెళ్ళి ఆత్మ హత్యకు పాల్పడ్డారు. సోమవారు పెట్ ఎస్సై రమేష్ కుమార్ స్థానిక నాలుగో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు