ఆన్‌లైన్ జూదం ఆటల్లో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలైన వేములవాడకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్‌లోని కోతిరాంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకున్నాడు .
వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన నరాల కార్తీక్ (35) ఆన్‌లైన్ గేమ్స్, క్యాసినో, జూదం ఆటలకు అలవాటు పడి భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రూ.కోటి వరకు అప్పులు చేసినట్లు సమాచారం. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక .. కరీంనగర్‌లోని కోతిరాంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
