కొత్త అధికారి కి బాధ్యతలు ఇవ్వడంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ల పక్రియ మందగించింది. ఒక్కో ఫైల్ క్లియర్ కావడానికి గంటల తరబడి సమయం పడుతుండడం తో ప్రజలు అసహనంతో రగిలి పోయారు.
అందరూ ఒక్కేసారి మీదికి రావడంతో సబ్ రిజిస్టర్ పోలీసులను రంగం లోకి దించారు. పోలీసులు సబ్ రిజిస్టర్ కార్యాలయం లో మోహరించి మరి రిజిస్ట్రేషన్ పక్రియ సాఫీగా సాగేలా చేశారు.
సబ్ రిజస్టర్ శ్రీధర్ రాజు అనారోగ్యం తో సెలవులో వెళ్లారు అయన స్థానంలో మంచిర్యాలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన కవిత గత ఆరు నెలల క్రితం సాధారణ బదిలీల్లో భాగంగా నిజాంబాద్ డిఆర్ఓ రికార్డ్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ గా బదిలీ చేశారు.
శ్రీధర్ రాజు స్థానంలో కవిత కు ఇంచార్జి సబ్ రిజిస్టర్ గా నియామకం అయ్యారు
రికార్డ్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కవితకు రిజిస్ట్రేషన్ పక్రియ ను వేగంగా చేయలేక పోతున్నారు. ప్రతి డాక్యుమెంట్ కు అన్ని లింకులు ఉన్న సరే అనవసర కొర్రీ వేస్తూ రిజిస్ట్రేషన్ చేయడం లేదు.
రిజిస్ట్రేషన్ కోసం డాకుమెంట్ లు ఆఫీస్ లో టేబుల్ మీద పేరుకు పోయాయి రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక్కో రోజు దాదాపుగా 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. గత మూడు రోజుల నుంచి రోజుకు ఆరు నుంచి పది డాక్యుమెంట్ల మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి వారందరూ రోజుల తరబడి వేచి చూస్తున్నారు.ఒక్కో రిజిస్ట్రేషన్ కోసంరెండు మూడు రోజులు వేచి చూడాల్సి వస్తుంది.
తమ వంతు ఇప్పుడు వస్తుందో తెలియక కార్యాలయం వద్దే పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం అసహనం తో కొందరు సబ్ రిజిస్టర్ వద్దకు వచ్చి తమ డ్యాకుమెంట్ లు ఎందుకు పెండింగ్ లో పెట్టారని నిలదీశారు.
ఏవైనా పత్రాలు లేకుంటే చెప్పాలని అంతే కానీ రిజిస్ట్రేషన్ లకోసం రెండు మూడు రోజులు జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ మండి పడ్డారు.
ఒకవేళ రిజిస్ట్రేషన్ చెయ్యకుండా డ్యాకుమెంట్ లు పక్కకు పెడితే ఏ కారణంతో పక్కకు పెట్టారో చెప్పాలంటూ ఒత్తిడి చేశారు దీనితో ఒక్కసారి వారంతా తోసుకురావడంతో కంగారు పడ్డ ఆమె రూరల్ పోలీసులకు ఫోన్ చేసి ఉన్నపలంగా వచ్చి పరిస్థితి చక్కదిద్దాలని కోరారు దీనితో రూరల్ పోలీసులు హుటాహుటిన వచ్చి ఆమె ఛాంబర్ వద్ద గుమిగూడిన వారందరిని బయటికి పంపేశారు.
శనివారం ఇలాగే చేస్తే జిల్లా రిజిస్టర్ కు పిర్యాదు చేస్తామని డ్యాకుమెంట్ రైటర్ లు చెప్పారు
Who r u, without verifi cc ation of actual data, who r u to publish the wrong information to the public