బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్టప్రకారం వాటిని వేగంగా పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి సీపీ స్వయంగా హాజరై బాధితుల నుంచి 32 అర్జీలను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్‌కు విన్నవించుకోగా, మొత్తం 32 ఫిర్యాదులు నమోదయ్యాయి.ఈ సందర్భంగా పలువురు బాధితుల సమస్యలపై సీపీ అక్కడికక్కడే స్పందించారు.
సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో ఫోన్లలో మాట్లాడి, ఆయా కేసుల స్థితిగతులపై ఆరా తీశారు. బాధితులకు న్యాయం జరిగేలా తగిన సూచనలు చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
