మానవత్వాన్ని చాటుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీయల్ టైగర్స్ సైనికులుబోధన్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన రక్షిత్ మృతి చెందడంతో చలించిపోయిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ సైనికులు మానవత్వాన్ని చాటుకున్నారు.
రక్షిత్ కుటుంబం కష్టకాలంలో ఉందని తెలుసుకున్న సైనికులు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ 30,500 రూ .లు ఆర్థిక సహాయం అందించారు.కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో ఉన్న రక్షిత్ కుటుంబానికి తమ వంతు సహాయం అందించి, వారికి రియల్ టైగర్ సభ్యులు మనోధైర్యాన్ని కల్పించారు.
దేశ రక్షణలో నిరంతరం సేవలందించే సైనికులు, తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు కూడా స్పందిస్తూ తమ సేవా భావాన్ని చాటుకోవడం పలువురిని ఆకట్టుకుంది.ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మీ సైనికుల సేవాభావంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
కష్టకాలంలో ప్రతీ సైనికుడి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఉమ్మడి నిజామాబాద్ రియల్ టైగర్స్ పేర్కొన్నారు…ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర్ తో పాటు సైనికులు కె . రమేష్,బి.సురేష్, ఆర్.రాజు, ఏ.ఎన్ గౌడ్, ఎం. అనిల్, విఠల్ తో పాటు పలువురు సైనికులు పాల్గొన్నారు..
