HomeTelanganaNizamabadరాజకీయ రగడ గా మారిన వంతెన నిర్మాణాలు ........పనుల జాప్యం దీక్ష కు సిద్ధం అయిన...

రాజకీయ రగడ గా మారిన వంతెన నిర్మాణాలు ……..పనుల జాప్యం దీక్ష కు సిద్ధం అయిన ఎంపీ అర్వింద్ ……….

ఏళ్ల తరబడిగా సాగుతున్న మాధవనగర్ ROB పనులు రాజకీయ రగడగా మారాయి. ఈ వంతెనలపనుల కోసం నిధులు మంజూరి చెయ్యడానికి సీఎం హామీ ఇచ్చారని అధికార పార్టీ నేతలు ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ మాధవనగర్ బ్రిడ్జి వద్ద నిరసన దీక్ష.కార్యాచరణ ను ప్రకటించడం ప్రకటించడం వర్గాలలో ప్రకంనలు రేపుతోంది.గతంలో ఇదే వంతన పనులమీద రాజకీయ రచ్చ సాగింది వ్యవహారం బిఆర్ యస్ వర్సెస్ అరవింద్ మారింది.

మాధవనగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10:00 గంటలకు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నిరసన దీక్షలో ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ , ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి తో పాటు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

ఈ బ్రిడ్జి మంజూరు కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ చేయని ప్రయత్నం లేదు. కేంద్ర ప్రభుత్వ వాటాను 25 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెంచి పూర్తి నిధులు మంజూరు చేయించారని బీజేపీ చెప్తుంది .మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్వింద్ సీఎం రేవంత్ ను కల్సి వంతెన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయించాలని కోరడం కొంత మేరకు నిధులు వచ్చాయి మరోసారి అర్వింద్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ను కల్సి బిల్లులు క్లియర్ చెయ్యాలని కోరారు బ్రిడ్జి పనులు ప్రారంభమైన నాటి నుంచి గతంలో అర్వింద్ ఎక్కడ మంచి పేరు వస్తుందోనని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

కమీషన్ల కక్కుర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనులను అటకెక్కించిందనేది బీజేపీ వాదన .గతంలోనూ మాధవనగర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ దీక్ష చేసారు

// అదనపు నిధులు కోసం పంచాయితీ// మాధవనగర్ బ్రిడ్జి పనులఅంచనా పెరగడం తో దాదాపు రూ 9 కోట్ల తో అదనపు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంపీ అర్వింద్ కలిసి నిధుల ఫైలును ఫైనాన్స్ విభాగానికి పంపించారు.

అయితే గత రెండు సంవత్సరాలుగా ఆ ఫైలును ఫైనాన్స్ విభాగంలో తొక్కిపెట్టి నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు మరో వైపు చేసిన పనులకు నెలల తరబడిగా బిల్లులు క్లియర్ కాక పోవడంతో గుత్తేదారు పనులు నిలిపి వేశారు. అందుకే వంతెన పనులు ఏళ్ల తరబడిగా సాగుతున్నాయి.

ఇప్పటికే అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన ఎంపీ అర్వింద్ ధర్మపురి దీక్ష కు సిద్ధం అయ్యారు. దీనితో అప్రమత్తం అయిన కాంగ్రెస్ నాయకులు హడావుడిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినిధులు క్లియర్ చెయ్యాలని కోరారు.

కానీ మంగళవారం నాటి బీజేపీ దీక్ష నేపథ్యలో వంతెన వేదిక గా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ల మధ్య రాజకీయ రచ్చ సాగుతుంది నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాభివృద్ధి కమిటీలు (VDC), ఆటో యూనియన్లు, వర్తక-వ్యాపార సంఘాలు, కుల సంఘాల నాయకులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, పెట్రోల్ పంపు యాజమాన్యాలు, వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్షకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments