HomeDevotionalఇందూరు నుంచి శబరిమలకు పాదయాత్ర దైవనిర్ణయం..ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...

ఇందూరు నుంచి శబరిమలకు పాదయాత్ర దైవనిర్ణయం..ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…

శబరిమలకు పాదయాత్రగా వెళ్లడం అనేది దైవ నిర్ణయం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇందూరు శ్రీధర్మశాస్త్ర పాదయాత్రను సోమవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహా పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములందరికి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మొత్తం 40 మంది స్వాములు సుమారు 45 రోజులపాటు పాదయాత్రగా శబరిమల చేరుకుంటారని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అయ్యప్ప మాల ఎంతో పవిత్రమైందని, మాలాధారనతో పాదయాత్రగా వెళ్లడమనేది మరింత కఠినమైందన్నారు. కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గుండయ్య గురుస్వామి, ఆగమయ్య గురుస్వామి, పాదయాత్ర స్వాములు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments