జన్మనిచ్చిన అమ్మ, జీవితాన్ని ఇచ్చిన నాన్నను సోదరులలో చూసుకుంటూ తోబుట్టువులు సంబరపడతారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజు రాఖీని జరుపుకుంటారు.
ఎంత దూరంలో ఉన్న అన్నదమ్ములను కలిసేందుకు ఆడబిడ్డలు పుట్టింటికి చేరి రాఖీ కట్టి తమకు రక్షణగా నిలవాలని కోరుతారు. చీరసారెలతో కానుకలు ఇచ్చి తమ ఆప్యాయతను చాటుకుంటారు అన్నదమ్ములు .
ఈ ఏటా రక్షాబంధన్ పండగ సందడి మొదలైంది. రేపటి రాఖీ పండుగ పురస్కరించు కొని జిల్లాలో వారం రోజుల ముందు నుంచే ఆడపడుచులు ఉత్సాహంగా రాఖీలు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.
అందుకు తగినట్లుగా వివిధ ఆకృతుల్లో కనువిందు చేస్తున్న రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది. చూడచక్కని రాఖీలను అమ్ముతున్న దుకాణాల ఎదుట జనం బారులు తీరుతున్నారు.
హోల్సేల్, రిటైల్ దుకాణాల్లో కళ్లు చెదిరే డిజైన్లతో ఉన్న రాఖీలను అమ్ముతున్నారు.
ఒక్కో రాఖీ రూ.10 నుంచి రూ. 500ల వరకు ఉన్నాయి. వెండి, ప్లాస్టిక్ రాఖీలు, చిన్న పిల్లలను ఆకర్షించేందుకు చోటా భీమ్, బాల్ గణేష్ , డోరిమాన్, చిం చ్యాన్, టామ్ అండ్ జెర్రీలతో పాటు, కారు, బైక్, సైకిల్ బొమ్మలతో కూడినవి, విమానం, విజిల్ వేసేలా చిన్నారులకు వాచీ ఆకారంలో ఉండేలా రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి.
చిన్నారుల కోసం ఎన్నో రకరకాల రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. మహిళలు, యువతులు, మంచి డిజైన్లలో ఆకట్టుకునేలాఉండే రకరకాల రాఖీలను కొనేం దుకు ఆసక్తి చూపుతున్నారు.
వీటి తో పాటు బహుమతులు కొనేందుకు ప్రజలు దుకాణాలకు చేరుకోవడంతో, మార్కెట్లో సందడి నెలకొంది.
ఏటా ఆకట్టుకునేలా రాఖీలు.. ఏటా మార్కెట్లోకి ప్రజలను ఆకర్షించేలా రాఖీల ను. వ్యాపారస్తులు తెచ్చి, ప్రజలు కొనేలా చేస్తు న్నారు.
గతంలో చిన్నపాటి పరిమాణంలో దూది, ప్లాస్టిక్ తో తయారు చేసిన హంస, స్వస్తిక్, నెమలి ఈకలు, నాణేలు, నోట్ల రూపాల్లో రాఖీలు తయారు చేసేవారు.
ఇప్పుడు రకరకాల డిజైన్లతో మార్కెట్లో రాఖీలు దర్శనమిస్తున్నాయి.
వివిధ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధారం, దూది మొదలుకొని వెండి, బంగారు రేకులతో త యారు చేసిన రకరకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఏటా రాఖీల ధరలు పెరుగు తున్నా, అన్నాచెల్లెళ్ల ఆత్మీయత ముందు పెరిగిన ధరలు ప్రభావం చూపడం లేదని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక కిట్లతో కూడిన రాఖీలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. ఇతర దేశా లకు, దూర ప్రాంతాలకు రాఖీ కిట్ల ను ఎక్కువగా పంపుతుండడం సంప్రదాయంగా కొనసాగుతుం ది.
ఈ కిట్లలో రెండు రాఖీలు, కుంకుమ బొట్టు, పసుపు, అక్షింతలు, చాక్లెట్, జీడిపప్పులు ఉం టాయి.
వెండి కోటెడ్ మంగళహారతి పళ్లెం రూపం లో కూడా ఉన్నాయి. ఈ కిట్ ధర రూ.900 నుంచి రూ.1000 వరకు ఉంటుంది.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన రాఖీలను హైదరాబాద్, బెంగళూర్, మహారాష్ట్ర, పూణె, రాజస్థాన్ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.
Happy rakhi