రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం ఫకిరాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
బోధన్ నగరంలోని ఆటో నగర్ కు చెందిన ముత్రకర్ బాలాజీ(33).
తన చెల్లెలుతో కలిసి పర్బని ప్యాసింజర్ లో ప్రయాణిస్తుండగా ఫకీరాబాద్- బాసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కాలు జారీ కింద పడి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించి లోకో పైలట్ ట్రైన్ ను ఆపి క్షతగాత్రుడిని బాసర కు తీసుకురకు తరలించి 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్సై సాయరెడ్డి తెలిపారు.