శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘాలు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లు హాజరు అయ్యారు.
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కోటపై జెండా ఎగరవేశారు ఆయన పేదలకు పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు తోడుంటూ అన్ని కులాలను కూడగట్టుకుని ముందుకు వెళ్లేవాడు
ఇప్పటి యువకులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ గౌడ సంఘం కులస్తులందరికీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలు కలెక్టర్ అందరు కూడా నిజాంబాద్ గౌడ సంఘ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు