Friday, April 18, 2025
HomeCRIMEవైఫల్యం అధికారులది ....మూల్యం చెల్లించేది పేదలు ......సర్కార్ స్థలాలఅమ్మకాల్లో వాటాలు మెక్కిందెవరో .....తిలాపాపం తలా...

వైఫల్యం అధికారులది ….మూల్యం చెల్లించేది పేదలు ……సర్కార్ స్థలాలఅమ్మకాల్లో వాటాలు మెక్కిందెవరో …..తిలాపాపం తలా పిడికెడు

ప్రభుత్వ భూమి అదికూడా చెరువు శిఖం ను అన్యాక్రాంతం చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు ఎట్టకేలకు కూల్చేశారు. ముప్పై ఇండ్లను నేలమట్టం చేసారు. తామేదో పొడిచేశామని యంత్రాంగం బీరాలు పలుకుతుంది.

అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. నిలువ నీడలేక లబోదిబో మంటున్నాయి. లక్షలాది రూపాయలు తీసుకోని పేదలకు ఈ స్థలాలు అమ్మేసిన నేతలు సైలెంట్ మొడ్ లోకి వెళ్లిపోయారు.

ఒకరిద్దరీ మీద కేసులు నమోదు చేసి చేతులు దులుపు కొనే కుయుక్తులకు యంత్రాంగం సిద్ధం అయింది.

జిల్లా కేంద్రంలో అదికూడా కలెక్టర్ నివాసం కు జస్ట్ అర కిలో మీటర్ దూరంలో ఉండే భూమి ని అదికూడా చెరువు శిఖంను కబ్జా చేసి ఓపెన్ ప్లాటలను బాహాటంగా అమ్ముతుంటే అధికారులు ఏమి చేసి నట్లు ఎందుకు నిస్సహాయులుగా ఉన్నారు.

ఎందుకంటే ఈ అమ్మకాలలో అదికారులకు సైతం వాటాలు అందాయి. అందుకే ఎవ్వరు పిర్యాదు చేసిన నో యాక్షన్. అందుకే స్థానిక ముఠాలు ఏళ్ల తరబడిగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కళ్ళముందే అన్యాక్రాంతం చేస్తున్నాయి.

అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడరు . రెవెన్యూ పొలీస్ మున్సిపల్ అధికారులకు ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల దశాబ్దాల తరబడిగా అన్యాక్రాంతం అవుతున్నాయని పిర్యాదు కోకొల్లలుగా వచ్చాయి.

ఎంపీ అర్వింద్ సైతం ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులు ఆక్రందనలను స్వయంగా కలెక్టర్ దృష్టి తెచ్చిన నో యాక్షన్.

ఎందుకంటే తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ ప్రాంతం లో జరిగే అక్రమాల్లో అందరికి వాటాలున్నాయి అందుకే ఎవ్వరూ నోరుమెదపని దుస్థితి.

ఈ ప్రాంతంలో చెరువు పక్కనే దాదాపు ఎకరం భూమి లో ప్లాట్ లు చేసి ఒక్కో ప్లాట్ ను 60 – 70 గజాలుగా చేసి రాళ్ళూ పెట్టి అమ్మకానికి పెట్టారు. ఎలాగో ఆ ప్రాంతంలో అదికూడా శిఖంభూమి లో ప్లాట్ కొనాలంటే ఎవరు ముందుకొస్తారు.

అందుకే దళారులను రంగంలోకి దించి మరీ పేద ప్రజలను లక్ష్యంగా ఈ ప్లాట్ లను అమ్మకాన్ని పెట్టారు. రెక్కాడితేగాని డొక్కాడని పేదలు రెక్కలు ముక్కలుచేసుకొని పైసా పైసా కూడబెట్టి వారికి ఒక్కోరి నుంచి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసి వారికి ఈ స్థలాలు కట్టబెట్టేసారు.

బాదాప్త పట్టా కూడా ఇవ్వడంతో స్థలం కొనుగోలు చేసిన వారు తమ స్తొమత మేరకు నిర్మాణాలు చేసుకున్నారు. ఎలాగో ప్లాట్ అమ్మకాలు వెనుక ఉంది గతంలో అధికార పార్టీకి కీలక నేతలు అందులోనూ ఓ ప్రజాప్రతినిధి భర్త తో పాటు ఆయన ఇద్దరు కార్పొరేటర్లు తెరవెనుక ఉండి తమ అనుయాయులతో ఈ ప్లాట్ లను ఓపెన్ గా అమ్మించారు.

నిర్మాణాలు మాత్రమే కూల్చేసిన ప్పటికి ఈ ప్రాంతంలో సుమారు అయిదు వందల మందికి ఇక్కడే ప్లాట్ లు ఇదే తరహాలో కట్టబెట్టారు.రెవెన్యూ మున్సిపల్ పోలీసు అధికారులకు సైతం మేనేజ్ చేసుకుంటూ ఈ ముఠా ఈ ప్రాంతంలో ఏళ్ల తరబడిగావిలువైన భూములను చెరబడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!