పోలీసు ల వేధింపులకు వ్యాపారులు వినూత్న నిరసనకు తెలిపారు. నిజామాబాద్ నగరంలో గాంధీ చౌక్ లో ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీ వాలా స్వీట్ షాప్ ముందు ఎక్కువగా వాహనాలు అడ్డదిడ్డంగా నిలపడం వల్ల రాకపోకలు స్తంభించి పోతున్నాయి.
అసలే మెయిన్ రోడ్డు కావడంతో తరుచు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ షాప్ ముందు నిలిపి ఉండే వాహనాల విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీనితో స్వీట్ షాప్ యజమానికి చిర్రెత్తు కొచ్చింది.
అంతే పోలీసుల వైఖరి ని నిరసిస్తూ షాప్ మూసేసి అదే షట్టర్ కు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసాడు. పోలీసులు వేధింపుల వల్లే షాప్ మూసేస్తున్నాని అందులో పేర్కొన్నారు.
ఆ రోడ్డు వెళ్లే వారు ఈ ఫ్లెక్స్ ను చూసి ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు