HomeLaw and Orderవిధి నిర్వహణలో నిబద్ధత.. ఉత్తమ అధికారులకు సేవా పథకాల ప్రదానం.

విధి నిర్వహణలో నిబద్ధత.. ఉత్తమ అధికారులకు సేవా పథకాల ప్రదానం.

నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన రక్షణ కల్పిస్తున్న పోలీస్ అధికారుల సేవలకు ప్రభుత్వం సముచిత గుర్తింపునిచ్చింది. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సేవా పథకాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పథకాలను అందజేసి అధికారులను అభినందించారు.పురస్కారాలు అందుకున్న వారిలో..

  • మహోన్నత సేవా పథకం: సిఎస్‌బి విభాగంలో సేవలందిస్తున్న ఎస్‌ఐ శేషగిరి సంతోష్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.
  • ఉత్తమ సేవా పథకం: ఇందల్వాయి ఏఎస్‌ఐ తప్ప నాగభూషణం, నవీపేట ఏఎస్‌ఐ షేక్ గఫార్, సిఎస్‌బి హెచ్‌సి బద్దం జగదీశ్వర్ ఉత్తమ సేవా పథకాలను అందుకున్నారు.

  • సేవా పథకం: వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న మరో 15 మంది అధికారులకు సేవా పథకాలు దక్కాయి. వీరిలో ఇన్‌స్పెక్టర్ బూక శ్రీనివాస్ (నార్త్ రూరల్), ఎస్‌ఐలు బడవత్ శివరాం, అసంపల్లి ఆనంద్‌సాగర్, ఖాన్ హబీబ్, పంకిపండ్ల రాజేశ్వర్, పంగేర సంజీవ రావు, గటదివడ్డే ఉదయ్ కుమార్, మొగ్రే విట్టల్ రావు ఉన్నారు.
  • అలాగే ఏఎస్‌ఐలు సుప్పాల రాజేందర్, మొహమ్మద్ అబ్దుల్ రహీమ్, హెచ్‌సిలు పసుపుల రాజేశ్వర్, పొచ్చమ్మకాడి మోహన్, ఏఆర్ హెచ్‌సి బేగ్ బిస్మిల్లా, పిసిలు చట్ల సుభాష్, కడవత్ రామారావు ఈ జాబితాలో నిలిచారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న తమ సిబ్బందికి ప్రభుత్వం నుంచి లభించిన ఈ గుర్తింపు పట్ల జిల్లా పోలీస్ శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments