HomeTelanganaNizamabadఆగిన ఆర్వోబీ పనులు.. మాధవనగర్‌లో ట్రాఫిక్‌ నరకం!..ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు.. నిత్యం వాహనదారుల అవస్థలు

ఆగిన ఆర్వోబీ పనులు.. మాధవనగర్‌లో ట్రాఫిక్‌ నరకం!..ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు.. నిత్యం వాహనదారుల అవస్థలు

నిజామాబాద్‌ నగరంలోని మాధవనగర్‌ వద్ద ఆర్వోబీ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు నిత్యం ట్రాఫిక్‌ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఒకవైపు రోడ్డు పనులు, మరోవైపు ఆర్వోబీ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.

ఒకవైపు నుంచే వాహనాలు రాకపోకలు సాగించాల్సి రావడంతో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతూ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.మాధవనగర్‌ మీదుగా నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన పడుతున్నారు.

అత్యవసరంగా వెళ్లాల్సిన వారు సైతం ట్రాఫిక్‌ నుంచి బయటపడలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆర్వోబీ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో, ట్రాఫిక్‌ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నిలిచిపోయిన పనులను వేగవంతం చేసి, ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments