లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శికి ఏసీబీ నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధించింది.
2014 లో కోటగిరి మండల కేంద్రానికి చెందిన వడ్డే నర్సింలు తన తండ్రి పేరిట ఉన్న ఇంటిని ఆయనతో పాటు సోదరుడి పేరు మీదకు మార్పించుకోవాలని అనుకున్నాడు.
దీని కోసం పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ను సంప్రదించగా పని చేయడానికి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
దీంతో శుక్రవారం కేసులో ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ ఏడాది జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధించింది.
