HomeTelanganaNizamabadముగిసిన ఆర్యవైశ్య సంఘం వోట్ల లెక్కింపు ....బీజేపీ దే ఆధిపత్యం

ముగిసిన ఆర్యవైశ్య సంఘం వోట్ల లెక్కింపు ….బీజేపీ దే ఆధిపత్యం

నిజామాబాద్ నగర ఆర్యవైశ్య సంఘానికి చెందిన ఆరు అనుబంధ సంస్థలలకు సంబంధించి వోట్ల లెక్కింపు పక్రియ శుక్రవారం ముగిసింది.

మొత్తం ఆరు సంఘాల్లో రెండు సంఘాల అధ్యక్షులు ఏకగ్రీవంగా అయ్యాయి మిగితా సంఘాలకు గత ఆదివారం పోలింగ్ నిర్వహించారు .

ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా మా శెట్టి లిఖిత్ కుమార్నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షునిగా చిన్ని విశ్వనాధ్ గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మిగతా నాలుగు అనుబంధ సంఘాల్లోని అధ్యక్ష పదవుల కోసం ఉత్కంఠభరితంగా ఎన్నికలు సాగాయి. .

మొత్తం 10,017 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా, ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదై, 3,000 కన్నా తక్కువ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.పట్టణ ఆర్యవైశ్య సంఘం తో పాటు మాణిక్ భవన్ స్కూల్ కు సంబంధించి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సైతం రంగంలో కి దిగాయి.

ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గెలిచారు ఆర్యవైశ్య ఉన్నత పాఠశాల మాణిక్యాన్ కమిటీ అధ్యక్షుడు ఇంగు శివప్రసాద్వైశ్య భవన్ కమిటీ అధ్యక్షుడు ఇల్లందుల సుధాకర్శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు పాల్తే రవికుమార్.

కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు తమ సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.కౌటింగ్ కేంద్రం వద్ద గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments