భారీగా నిషేధిత ఆల్ఫాజోలం పట్టుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ సోమిరెడ్డి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు జన్నపల్లి చిక్లి వెళ్ళే మార్గంలో సోదాలు నిర్వహించగా ఓ గూడ్స్ వాహనంలో కొంపల్లి వెంకట్ గౌడ్ దగ్గర కల్లు లో కలిపే మత్తు పదార్థం ఆల్ఫాజోలం నాలుగు ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు.
ఈ మేరకు అతన్ని పట్టుకొని విచారించి ఇంటి వద్దకు వెళ్లి తనిఖీలు చేయగా 1.113 కేజీల ఆల్ఫా జోలం ,10.090 కేజీల క్లోరాల్ హైడ్రేట్ అనే మత్తు పదార్థాలు దొరికినట్లు తెలిపారు. ఈ మేరకు అవి ఎక్కడ నుంచి తీసుకు వస్తున్నాయని విచారించగా రుద్రూర్ కి చెందిన రాజా గౌడ్ దగ్గర నుంచి తీసుకువస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రుద్రూర్ కి చెందిన రాజా గౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు.కొంపల్లి వెంకట్ గౌడ్ స్టేట్మెంట్ ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సోదాలలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
