భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన గౌడ సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు.
చేంగల్ గ్రామానికి చెందిన గౌడ సంఘ సభ్యులు ఆనంద్ గౌడ్, బాబా గౌడ్, పవన్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, పెద్ద నాగన్న, కస్ప లింబన్న, ఎర్రన్న, పులి నరేందర్, బాకార మహేందర్, పురాస్తపు పెద్ద గంగాధర్, ప్రశాంత్ రెడ్డి, దశ గౌడ్, గంట గంగారం, గంగమల్లు మరో 25 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
