నగర నడి బొడ్డున దశాబ్దాల తరబడిగా సాగుతున్న పటాకులు దందా ను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. మామూళ్ల మత్తు అలవాటు పడిన యంత్రాంగం ప్రజల ప్రాణాల కు పెను ప్రమాదం పొంచి ఉన్నా ఈ దందా ను నియంత్రించలేక పోతుంది.
కోట్ల రూపాయల దందా సాగిస్తున్న వ్యాపారాలు తమ అడ్డాలను నగర శివారు ప్రాంతాలకు తరలిస్తామని ప్రతియేటా బుకాయిస్తున్నారు. కానీ నిత్యం వేలాది మంది రద్దీ ఉండే ప్రాంతాల్లో నే అందులోనూ ఆరు బయటే యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు.
ప్రమాదలు జరిగాక హడావుడి చేసి రంకెలు వేసి అధికారులు అసలు విపత్తులు తలెత్తకుండా ఎందుకు జాగ్రత లు తీసుకోరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమే పటాకులు వ్యాపారులకు శ్రీరామ రక్షా మారింది. ఆయా శాఖ లకు చెందిన అధికారులు నిస్సిగ్గుగా పటాకులు దుకాణాలకు వెళ్లి బేరం ఆడుకొని తమ వాటాలు తీసుకెళ్లారు అదే వ్యాపారులకు అలుసుగా మారింది.
అందుకే జనసమూహం ఉన్న చోటే పటాకులఅమ్మకాలు సాగిస్తుంన్నారు.అగ్నిమాపక మున్సిపల్ పోలీస్ శాఖ లతో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రతియేటా క్రమం తప్పకుండ దండిగా మామూళ్లు మెక్కుతున్నారు అందుకే ఎవ్వరూ ఈ దందా ల జోలికి వెళ్ళడానికి ఆసక్తి చూపారు.
కోట్ల రూపాయల టర్నోవర్ తో సాగె దందా లను రద్దీ ప్రాంతాల నుంచి శివారు ప్రాంతాలకు తరలించడానికి వ్యాపారాలు ససేమిరా అంటున్నారు గట్టిగా అడిగే వారే లేక పోవడంతో ఈ దందా లకు నిర్దేశించిన నియమావళి ని అమలు చేసే పరిస్థితి లేదు. అసలు జనావాసాల మధ్య పటాకులనిల్వ అమ్మకాలఫై నిషేధం ఉంది సాక్షాత్తు సుప్రీం కోర్టే ఆంక్షలు పెట్టింది.
కానీ పటాకులు అమ్మకాలు మాత్రం యధావిధి గానే సాగుతున్నాయి. సరే రిటేల్ అమ్మకాలు అంటే ఎదో పండగ అవ్వగానే ఎత్తేస్తారు అనుకోవచ్చు కానీ కోట్ల రూపాయల విలువైన పటాకులు అమ్మకాలు అదీ ఏడాది పొడుగునా అమ్మకాలు సాగించే హోల్ సెల్ వ్యాపారాలు సైతం వేలాదిమంది తో కిక్కరిసివుండే ప్రాంతాల్లోనే దందా లు సాగిస్తున్నారు
కనీసం ఏదైనా విపత్తు జరిగితే ఫైర్ ఇంజన్ కూడా వెళ్లడం కూడా కష్టమే అలాంటి ఇరుకు ప్రాంతాల్లో హోల్ సెల్ దందా లు సాగుతున్నాయి. పండగ కు నెల రోజుల ముందు అధికారులెవ్వరు తమ దందా ల వైపు కన్నెత్తి చూడకుండా బరువైన కవర్ లు ముట్టజెప్పడం ఆనవాయితీ గా వస్తుంది.
కవర్ లే కాదు గిఫ్ట్ ప్యాక్ లు పుష్కలంగా ఇచ్చేస్తారు అందుకే తమ జోలికి ఎవ్వరూ రారు అనే ధీమాతో ఉన్నారు రద్దీ ని నియంత్రించడానికి వన్ వే అమల్లోకి తెచ్చిన పోలీసు శాఖ అదే రద్దీ ప్రాంతంలో అత్యంత ప్రమాద కరమైన పటాకులు దందా మాత్రం కొరడా ఝుళిపించలేక పోతుంది.
