12 మందికి జరిమానా..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి ముగ్గురికి జైలు శిక్షా, 12 మందికి జరిమానా మందికి విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు.
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ మంగళవారం 15 మందికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందు హాజరు పరిచారు.
దీంతో 12 మందికి రూ 18500 జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే సోన్ కామ్ లే ప్రకాష్, ఐల రమేష్, రాజన్నల శ్రీధర్ లకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
