Saturday, May 2, 2026
HomeTelanganaNizamabadపరీక్షలు వాయిదా వేయాలి ....రిజిస్టర్ ను కోరిన కాలేజీ యాజమాన్యాలు

పరీక్షలు వాయిదా వేయాలి ….రిజిస్టర్ ను కోరిన కాలేజీ యాజమాన్యాలు

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకై చేస్తున్న బంద్ ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ని కలిసి వినతి పత్రం అందజేసిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యం సభ్యులు.

అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ప్రభుత్వం విడుదల చేసే విధంగా సహకరించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కి విన్నపం చేసిన ప్రైవేట్ కళాశాల యాజమాన్యం సభ్యులు.

ఈరోజు డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ని కలిసి వివిధ అంశాల పైన వినతి పత్రం అందజేసిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ సభ్యులు.

ఈ సందర్భంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో తాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తమకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వస్తేనే కళాశాల నడిపే పరిస్థితి ఉన్నందున గత నాలుగు రోజుల నుండి కళాశాలలను బంద్ చేసి నిరవధికంగా బంద్ చేసి తమ నిరసన తెలుపుతున్నామన్నారు.

ఒకవైపు కళాశాలలు బంద్ ఉండడంతో విద్యార్థులు పరీక్షా ఫీజులు కూడా కట్టడానికి రాలేకపోయారని ఇంకా దాదాపు 40 శాతం మంది విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉందని వాపోయారు.

ఈ కళాశాలల బంద్ పూర్తయ్యే వరకు పరీక్షల సమయ సారిణిని విడుదల చేయొద్దని… అదేవిధంగా పరీక్షా ఫీజు చెల్లించే చివరి తేదీని కూడా పెంచాలని మనవి చేశామని అన్నారు.

గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో తమ కళాశాలలు కోలుకోలేని విధంగా మారిపోయాయని, ఇప్పుడు కళాశాలలు తెరిచినా గాని సిబ్బంది పనిచేయడానికి రావడానికి సుముఖంగా లేరని జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కళాశాల యాజమాన్యాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్య అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్ తో పాటు మారయ్య గౌడ్, శంకర్,శ్రీనివాసరాజు, గురువేందర్ రెడ్డి అరుణ్ గిరి,రమణ, సత్యం, దత్తు, విజయ్,గంగాధర్, చందన్,గంగారెడ్డి,రషీద్, షకీల్, వెంకట, కిషన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!