పౌరుల రక్షణ, భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి తెలిపారు. నగరంలోనీ ఒకటవ టౌన్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు.
ఈ మేరకు సోమవారం ఉదయం ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో, టౌన్ వన్ ఎస్.హెచ్. ఓ, బి.రఘుపతి, టౌన్ సీఐ రూరల్ ఇన్స్పెక్టర్ డివిజన్ కి సంబందించిన ఎస్ఐలు, కానిస్టేబుల్స్ దాదాపు 100 మందితో టీములుగా ఏర్పడి వన్ టౌన్ పరిధిలోగల రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, హాస్పిటల్స్, చౌరస్తా, షాపింగ్ మాల్స్, రోడ్డు పక్కన పడుకుని ఉన్నటువంటి అనాధలు, భిక్షాటకులు , లేబర్స్, అపరిచిత వ్యక్తులు వారి యొక్క వివరాలు, వారికి సంబంధించిన రక్తసంబంధికుల వివరాలు తీసుకొని, ఫోటోలు తీసుకున్నట్లు తెలిపారు.
