స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి జి.వి.శ్యాంప్రసాద్ లాల్ ను, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా కామారెడ్డి జిల్లా ఆడిట్ అధికారి జె. కిషన్ పమర్ ను నియమించిందని తెలిపారు.
