నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 6 గురు ఎస్ఐ లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ 2 గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ పాల్ ను ముప్కాల్ ఎస్ హెచ్ ఓ గా బదిలీ చేశారు.అలాగే ముప్కాల్ లో ఎస్ఐ గా ఉన్న రజినీకాంత్ ను ఆర్మూర్ టౌన్ ఎస్ఐ గా బదిలీ చేశారు.
నగరంలోని ఒకటవ టౌన్ లో ఎస్ఐ గా ఉన్న షరీఫ్ ను నిజామాబాద్ రూరల్ ఎస్సై గా బదిలీ చేశారు.నిజామాబాద్ రూరల్ ఎస్సై ఎస్ఐ గా ఉన్న అరీఫ్ ను వీఆర్ కు అటాచ్ చేశారు.
వీఆర్ లో అటాచ్ ఉన్న జి.మహేష్ ను జక్రంపల్లి కి బదిలీ చేసి అక్కడే ఉన్న మాలిక్ రహ్మాన్ ను వీఆర్ కు అటాచ్ చేశారు. వీరందరూ తక్షణమే వారికి బదిలీ చేసిన టౌన్ లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
