మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు చర్యలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు 1384 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు పేర్కొన్నారు.మొదటి విడత బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు గలవు.
ఈ సబ్ డివిజన్ పరిధిలో 11 మండలాలలో 1084 గ్రామపంచాయతీలు 1642 వార్డులలో 268 పోలింగ్ కేంద్రాలలో 2,61,210 మంది ఓటర్లు గలరు.అలాగే మూడు చెక్ పోస్ట్ లను ( సాలూర , కండ్ గావ్, పోతంగల్ ) ఏర్పాటు చేసి నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7వాహనాల తనిఖీలు చేస్తున్నామన్నారు. అలాగే లిక్కర్ మొత్తం 361.46 లీటర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.
వాటి విలువ దాదాపు 2,56,985/- గలదు. బోధన్ డివిజన్ పరిధిలో బైండోవర్ లు మొత్తము 183 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగింది. బోధన్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై మూడు కేసుల నమోదు చేయడం జరిగింది .
ఎడపల్లి , బోధన్ రూరల్ , కోటగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 10 గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా ఆరుగురు డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా నాలుగు గన్ లైసెన్సులు బ్యాంకులకు సంబంధించినవనీ పేర్కొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 1384 మందిని సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
