తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ ను మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఉల్లెంగ నాగరాజ్ మర్యాదపూర్వకగా కలిశారు. బుదవారం నిజామాబాద్లో జరిగిన ఈ భేటీలో పలువురు డివిజన్ నాయకులు కూడా పాల్గొన్నారు.
మహేష్ కుమార్ గౌడ్‌కు ఉల్లెంగ నాగరాజ్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా l పార్టీ బలోపేతం, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, పలు అంశాలపై వారు చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో యువత పాత్రను, సంఘం తరఫున అందిస్తున్న మద్దతును ఈ సందర్భంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఉల్లెంగ నాగరాజ్ వెంట వివిధ డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
