రోడ్లపై ప్రయాణించాలంటే వాహన దారులు జంకుతున్నారు. యాసంగి వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకు కారణం. రోడ్లు మొత్తం ధాన్యం రాశుల కి తో నిండిపోతున్నాయి. సగం రోడ్లు ధాన్యం కుప్పలతో ఆక్రమిస్తుండడంతో ప్ర మాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దారులన్నీ ధాన్యం కల్లాలుగా దర్శనమిస్తున్నాయి.
రాత్రివేళ ధాన్యం కుప్పలు కనిపించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ధాన్యం అరబె ట్టేందుకు పొలాల వద్ద కల్లాలు లేకనే రోడ్లపై ధాన్యం పోయాల్సి వస్తోందని రై తులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. యాసంగిలో సాగు చేసిన దిగుబడులు ఇప్పుడిప్పుడే చే తి కి వస్తున్నాయి.
నగర శివారు నుంచి పలు గ్రామాల్లో వరి ధాన్యంలను గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్లపై పోస్తున్నారు. ధాన్యం అరబె ట్టుకోవడానికి సరిపడా కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లపై అరబెట్టుకుం టున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా చూసినా రోడ్ల వెంబడి ఒక వై పుకు ధాన్యం అరబోసి కనిపిస్తున్నాయి. అలాగే ధాన్యం ఎండిన తర్వాత సకా లంలో కొనుగోలు కాకపోవడంతో వారాల కొద్ది టార్పాలిన్లు కప్పి ఉంచుతా రు.
ఇలా ఉంచడంతో రాత్రివేళ సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లోనీ జనాలు రోడ్ల మీద ఉన్న కల్లాలు కనపడక చిన్నా పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న పాలకులు, వ్యవసాయ సొసైటీ సభ్యులు, చోద్యం చూస్తున్నారని వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముందు జాగ్రత్తలతోనే మేలు…
రైతుల భాగస్వామ్యంతో పలు ప్రభుత్వ శాఖ ఉద్యోగులు సమన్వయంగా వ్య వహరిస్తే ధాన్యం అరబోత వల్ల రహదారులపై జరిగే ప్రమాదాలు కొంత వర కు నివారించే అవకాశాలున్నాయి. వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా ధా న్యం దిగుబడులపై అంచనా వేసి ఆరబోయడానికి ముందే ప్రణాళికలు రూ పొందించాలి. రైతులు ధాన్యం అరబెట్టుకోవడానికి అనువుగా స్థలాలను మా ర్చాలి.
ఇక తప్పని సరి పరిస్థితుల్లో రోడ్లపై ధాన్యం అరబోస్తే కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి. సంచులు, కుప్పలు వాహన చోదకులకు కనిపించేలా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, రైతులు సమన్వ యంతో పలు జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకైనా ప్రమాదాలు ఆరికట్టవ చ్చని వాహన చోదకులు అంటున్నారు.
