ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి టూరిజం హోటల్ బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఆటోను లాగుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ చార్జీలు తగ్గించాలని నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.ఓమయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ యుద్ధంజరిగిన భారతదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లదని ఆరు నెలల పైచిలుకు పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మాయ మాటలు చెప్పి ఈరోజు కొంతమంది పడా వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చడానికి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలను తక్కువ చూపిస్తూ రేట్లు పెంచటానికి నిస్సిగ్గుగా పూలు కోవటం దుర్మార్గం అన్నారు.
ప్రజలకు పొదుపు మాటలు చెప్పే మోడీ ఆయన మాత్రం తినే తిండికి కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని వేసుకునే బట్టలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
నిజంగా మోడీకి ప్రజలపై ప్రేమ ఉంటే ప్రజా సంక్షేమమే ఆయన ఉద్దేశం అయితే ప్రజల నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని పెట్రోల్ డీజిల్ వంట చేస్తారని తగ్గించాలని ఆయన తిండి ఖర్చులు బట్టలు ఖర్చులు మెయిన్టెనెన్స్ తగ్గించి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ఇప్పటికైనా పెంచిన చార్జీలు తగ్గించకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బి అనిల్, పిన్నెల హనుమాన్లు, సురేష్, ఫిరోజ్, గోవర్ధన్ ,రంజిత్, ప్రసాద్ భానుచందర్ ,మహేష్ ,సలీం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ వై. ఓమయ్య సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
