రైళ్ల ద్వారా సాగుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఎక్సైజ్, ఆర్‌పీఎఫ్ అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టారు. శనివారం ఉదయం నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… సాంబాల్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 10.30 గంటల సమయంలో నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఎక్సైజ్ నిజామాబాద్ ఎస్‌హెచ్‌ఓ, ఆర్‌పీఎఫ్ బృందాలు రైలులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి.
అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తి బ్యాగును తనిఖీ చేయగా 5.35 కిలోల గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు రూ.1,33,750 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిని మహారాష్ట్రలోని హింగోలి జిల్లా గడిపురాకు చెందిన పూనంచంద్ శంకర్‌రావు చౌదరిగా గుర్తించారు.
విశాఖపట్నం నుంచి నాందేడ్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. గంజాయిని సీజ్ చేసి, నిందితుడిని అరెస్టు అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ స్వప్న, ఎస్‌ఐ మల్లేష్, సిబ్బంది మోహన్‌సింగ్, గౌతమ్, దేవేందర్, రాజేందర్ పాల్గొన్నారు.
