చమేడ్చల్ జిల్లా అల్వాల్ లో జరిగింది ఈ భారీ దోపిడి. మచ్చ బొల్లారంలోని జిఎంఆర్ గార్డెన్ రూట్ ఎస్టేట్ కాలనిలో ఓ ఇంట్లో చోరికి పాల్పడ్డ దోపిడి దొంగలు. రమేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ విహారయాత్రకు వెళ్లాడు.
ఫ్యామిలీ ఇంట్లో లేనిది చూసి పక్కా స్కెచ్ తో దోపిడికి పాల్పడ్డారు దొంగలు. 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, సుమారు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.
ఇంటిగేటు, ఇంటి తాళాలు పగలగొట్టిన విషయాన్ని గమనించిన స్థానికులు రమేష్ కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరిగు ప్రయాణం అయ్యారు బాధిత కుటుంబం.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు
