HomeHEALTHబాధ్యతాయుతమైన వైద్యులుగా సేవలందించాలిప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతన ఇంటర్న్‌లకు ఓరియంటేషన్ కార్యక్రమం..

బాధ్యతాయుతమైన వైద్యులుగా సేవలందించాలిప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతన ఇంటర్న్‌లకు ఓరియంటేషన్ కార్యక్రమం..

వైద్య వృత్తిలో అడుగుపెడుతున్న నూతన ఇంటర్న్‌లు బాధ్యత, క్రమశిక్షణతో కూడిన సేవలందించాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన బ్యాచ్‌ సీఆర్ఎంఐ ఇంటర్న్‌ల కోసం అవగాహన, ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణమోహన్ మాట్లాడుతూ, వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో నైతిక విలువలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అలాగే ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా. బి.వి. నాగమోహన్ మాట్లాడుతూ, ఇంటర్న్‌లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, విధుల నిర్వహణలో ఆసుపత్రి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.అలాగే, వైస్ ప్రిన్సిపాళ్లు డా. కె.జె. కిషోర్ కుమార్, డా. జె. తిరుపతి రావు, డా. విజయ్ కుమార్, డా. అరుణ రేఖ, డా. సలీం, డా. రమణ, డా. ఇమ్రాన్, డా. శివకృష్ణలు ఇంటర్న్‌లకు దిశానిర్దేశం చేశారు.ప్రధానంగా వీరు ,విధులు, బాధ్యతల నిర్వహణ, రోగుల సంరక్షణలో పాటించాల్సిన విధానాలు.అత్యవసర సేవలందించే తీరు. మెడికో-లీగల్ అంశాలు మరియు వైద్య నైతిక విలువలు.

ఆసుపత్రి సేవా ప్రమాణాలు పై అంశాలపై ఇంటర్న్‌లకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఇంటర్న్‌లను బాధ్యతాయుతమైన వైద్యులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డా. శ్రీకాంత్, డా. రవికిరణ్, డా. రాజశేఖర్, కళాశాల అధ్యాపకులు, వివిధ విభాగాధిపతులు, నూతన ఇంటర్న్‌లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments