HomeCRIMEఅమీర్ పేట్ భారీ అగ్ని ప్రమాదం

అమీర్ పేట్ భారీ అగ్ని ప్రమాదం

అమిర్ పేట్ మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న కే యస్ అర్ ఫ్యాషన్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో అమీర్‎పేట్‎లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమీర్ పేట్-ఎస్ఆర్ నగర్ రూట్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..కే యస్ ఆర్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో అత్యవసర సహాయక చర్యల కారణంగా అమీర్‌పేట నుంచి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అత్యవసర సహాయక చర్యల వల్ల అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. 

ఈ భారీ అగ్ని ప్రమాదంతో అమీర్ పేట్ మొత్తం నల్లటి పొగ అలుముకుంది. పొగ దట్టంగా కమ్మేయడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. అగ్ని మాపక శాఖ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి మరో వైపు పోలీసులు ఆ ప్రాంతంలో ట్రఫిక్ జామ్ ను క్లియర్ చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments