రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం , ఏబీవీపీ మసబ్ ట్యాంక్ వద్ద ఉన్న ఉన్నత విద్యా కార్యాలయాన్ని ముట్టడించింది. పెద్ద సంఖ్యలో ఏబీవీపీ విద్యార్థులు గుమిగూడారు.విద్యార్థులకు , పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కార్యాలయం వైపు విద్యార్థులు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేసారు ఎంతో కీలకమైన విద్యా శాఖ కోసం మంత్రిని నియమించలేదని ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించడంలో స్పష్టమైన అసమర్థత ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి ఆ పోర్ట్‌ఫోలియోను తన వద్దే ఉంచుకోవడాన్ని వారు విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థుల పట్ల ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే, ఏబీవీపీ భారీ ఎత్తున నిరసనలు చేపడుతుందని వారు హెచ్చరించారు.భారీ నిరసన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు
