భవానిపేట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా భవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం యూనిఫాంలు, బూట్లు పంపిణీ చేశారు.
గ్రామ సర్పంచ్ దోమకొండ విజయస్వామి, ఉపసర్పంచ్ ఆశన్నగారి మంజుల రమేష్‌గౌడ్, వార్డు సభ్యుడు ఎస్. రాజు విద్యార్థులకు యూనిఫాంలు, బూట్లు అందజేశారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు ఆశన్నగారి రమేష్‌గౌడ్, దోమకొండ స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
