వినాయక మండపాల నిర్వహకులు యువత ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శ్రీ ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మార్వాడి గల్లి లో గల కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెందాలను రాశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఇందూరు యువత భక్తి మార్గంలో నడవాలని సూచించారు. వినాయక ఉత్సవాలను హిందూ సాంప్రదాయం ప్రకారం ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ ట్రస్టు ద్వారా సహకారం అందిస్తామని గత సంవత్సరం 725 మండపాలకు అందించినట్లు పేర్కొన్నారు.
భగవంతుడి ఆశీర్వాదంతో ఈ ఏడాది కూడా వచ్చిన వారందరికీ తన వంతు సహకారం ఉంటుందన్నారు. వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు కాదని సంస్కృతి సనాతన ధర్మం ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగి శుభాలు జరుగుతాయన్నారు.
ఇంటింటా గణపతి పూజా చాలాకాలంగా ఉన్నప్పటికీ సామూహిక ఉత్సవాలకు బాలగంగాధర్ తిలక్ ప్రోత్సహించాడని గుర్తు చేశారు. దీనిద్వారా ప్రజలు ఒకచోట చేరి సామూహిక ఐక్యతను పెంపొందించుకొనే అవకాశం ఉంటుందన్నారు. శనివారం కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్ పాల్గొన్నారు.
