HomeLaw and Orderనిజామాబాద్‌ కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు

నిజామాబాద్‌ కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు

నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల (సీఐ) స్థానచలనం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 13 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్‌, రూరల్‌, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ తదితర కీలక విభాగాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనాపరమైన కారణాలతో పాటు సర్వీసు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజామాబాద్‌ టౌన్‌ సర్కిల్‌ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌రాజ్‌ను సీఎస్‌బీకి బదిలీ చేశారు.

ఆయన స్థానంలో ఆర్మూర్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న పాంతంగి సత్యనారాయణను నియమించారు. నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సర్కిల్‌ నుంచి బుకా శ్రీనివాస్‌ను 1 టౌన్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న బొదాకుంట్ల రఘుపతి ఐజీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. సౌత్‌ రూరల్‌ సర్కిల్‌ నుంచి నీరూడి సురేష్‌కుమార్‌ను పీసీఆర్‌కు బదిలీ చేయగా, ఆయన స్థానంలో ధర్పల్లి సర్కిల్‌లో ఉన్న బొడ్డు బిక్షపతిను నియమించారు. ధర్పల్లి సర్కిల్‌కు పీసీఆర్‌లో పనిచేస్తున్న సల్వాడి రామన్‌ను బదిలీ చేశారు.

వీఆర్‌లో ఉన్న చింతలతడెం శ్రీనివాస్‌కు నార్త్‌ రూరల్‌ సర్కిల్‌ బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న పబ్బా ప్రసాద్‌ను మహిళా పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న సుంకార శ్రీలత హైదరాబాద్‌లోని మల్టీజోన్‌-1 ఐజీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓగా సీఎస్‌బీ నుంచి గుమ్మడి మల్లేష్‌ను నియమించారు. సీఎస్‌బీలో ఉన్న కార్నే శ్రీధర్‌రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేసి నిజామాబాద్‌ రూరల్‌ పీఎస్‌కు అటాచ్‌ చేశారు. ఆయన స్థానంలో గణపతి శ్రీనివాస్‌రాజ్‌ సీఎస్‌బీకి వెళ్లనున్నారు.

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డులో ఓడీపై ఉన్న గుండు శ్రీకాంత్‌గౌడ్‌ను ఆర్మూర్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. హైదరాబాద్‌ జలమండలిలో డిప్యూటేషన్‌పై ఉన్న గుండు శ్రీకాంత్‌గౌడ్‌ను వెంటనే రిలీవ్‌ చేయాలని సంబంధిత ఎండీని ఐజీ ఆదేశించారు. ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి, బదిలీ అయిన అధికారులు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత యూనిట్‌ అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments