రోడ్డుపై అనారోగ్యంతో అనాధగా పడి ఉన్న ఓ వ్యక్తిపై తనలోని కరుణ తత్వాన్ని ప్రదర్శించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ కొంతం మంజుల మురళీధర్.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జరిగింది. గత మూడు, నాలుగు రోజులుగా టీచర్స్ కాలనీ కమాన్ ఎంట్రన్స్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో ములుగుతూ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని చూసిన కాలనివాసులు కౌన్సిలర్ కొంతం మంజుల మురళి దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించిన ఆయన అనారోగ్యంతో ఉన్న ఆ వృద్ధుని ఆరా తీయగా తన పేరు తిరుపతి అని, తనది ముప్కాల్ గ్రామమని వివరించాడు.
వెంటనే పరిస్థితిని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ లో విషయం తెలియజేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతనికి వైద్య సదుపాయం కల్పించారు.
అనారోగ్యంతో ఉన్న అనాధ యొక్క వివరాలను తెలుసుకునే పనిలో కౌన్సిలర్ మంజుల మురళి ఉండడాన్ని స్థానికుల అభినందిస్తున్నారు.
