Sunday, April 27, 2025
HomeCRIMEఅర్ద రాత్రి సబ్ స్టేషన్ ను ముట్టడించిన స్థానికులు ……తాగిన మైకం ఆపరేటర్

అర్ద రాత్రి సబ్ స్టేషన్ ను ముట్టడించిన స్థానికులు ……తాగిన మైకం ఆపరేటర్

గంటల తరబడిగా కరెంట్ సరఫరా నిలిచి పోవడంతో ఆగ్రహించిన స్థానికులు స్థానిక సబ్ స్టేషన్ ను ముట్టడించారు. అక్కడి ఆపరేటర్ తాగిన మైకం లో ఉడడంతో వారుఅక్కడే ఆందోళనకు దిగారు. నిజామాబాద్ నగరంలోనిఅర్సపల్లి లో 33 కెవి సబ్ స్టేషన్ లో సోమవారం అర్ద రాత్రి ఈ ఘటన జరిగింది.

చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్ధమనిగింది సబ్ స్టేషన్ పరిధిలో అర్ద రాత్రి రెండు గంటలుగా కరెంటు కట్ అయింది.

అసలే ఎండ వేడికి తాళలేక ఆటోనగర్ అర్సపల్లి ప్రాంతాలకు చెందిన ప్రజలు సబ్ స్టేషన్ కు తరలి వచ్చారు అక్కడ ఆపరేటర్ మద్యం మత్తులో ఉండడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు కరెంటు ఎందుకు లేదని ప్రశ్నించగా సమాధానం లేకపోవడంతో ప్రజలు కోపోద్రిక్తులయ్యారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో పోలీసులు కలగజేసుకొని ప్రజలను సర్ది చెప్పి వెళ్ళిపోవాలని కోరగా కరెంట్ వస్తే గాని మేము వెళ్ళమని ప్రజలు బైటాయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!