నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మెమో రగడ రచ్చకెక్కింది. బిల్ కలెక్టర్లు రోడ్డెక్కారు. డిప్యూటీ కమిషనర్ ఫై చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నేరుగా జిల్లా కలెక్టర్ ను కలిశారు. లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
నిజామాబాద్ నగరంలో ఆస్తిపన్ను పన్ను కు వసూళ్ల కు సంబంధించి ఆర్ వో ఆర్ ఐ లతో పాటు 27 మంది బిల్ కలెక్టర్లు 10 విఆర్వో 15 మంది సహాయకులకు టార్గెట్ లు పెట్టారు. ఏడాది రూ 35 కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఈ మొత్తం ను ఆయా బిల్ కలెక్టర్లకు వ్యక్తిగతంగానూ టార్గెట్ నిర్దేశించారు. నిజానికి మున్సిపల్ కార్పొరేషన్ లో కార్యనిర్వహణ తో అత్యవసరాల కోసం ఆస్థి పన్ను రూపేణా వచ్చిన రాబడి నుంచే వెచ్చిస్తారు.
అందుకే కార్పొరేషన్ లో ఉన్నతాధికారులు ఆస్థి పన్ను బకాయిల విషయంలో కఠిన కార్యాచరణతోనే వుంటారు. కానీ ఏడాది లక్ష్యానికి మించే ఆస్థి పన్ను వసూలు అంటే రూ 40 కోట్ల కు పైచిలుకు వసూలు చేసారు. అయినప్పటికీ ఆస్థి పన్ను వసూళ్ళ విషయంలో అధికారులు ఒత్తిడి కొనసాగించడం తో బిల్ కలెక్టర్లు ఉక్కిరి బిక్కిరి కి గురయ్యారు.
డిప్యూటీ కమిషనర్ ఓ అడుగు ముందుకేసి కొంత మంది బిల్ కలెక్టర్లకుఎడాపెడా మెమో లు ఇచ్చారు. అసలే పని ఒత్తిడి తో సతమతం అవుతున్న వారికి మెమో లు కంటిమీద కునుకు లేకుండా చేసాయి.వారంతా కమిషనర్ ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కానీ కమిషనర్ ఈ విషయంలైట్ తీసుకోవడంతో అధికార పార్టీకి చెందిన నేతలను ఆశ్రయించారు. కానీ లోకసభ ఎన్నికల కోడ్ ఎత్తి వేసాక చూస్తామన్నారు. కానీ మెమో ల బెడద మరింత తీవ్రం కావడంతో వారంతా సోమవారం కలెక్టర్ ను కలసి తమ బాధలు చెప్పుకున్నారు.
ఆస్థి పన్ను వసూళ్ల విషయంలో తాము రాత్రిబవళ్ళు పనిచేశామని నిర్దేశించిన లక్ష్యం ను సాధించామని అయినప్పటికీ మెమో లు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు