HomeCRIMEహెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి అంత్యక్రియలకు హాజరైన సీపీ

హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి అంత్యక్రియలకు హాజరైన సీపీ

గుండెపోటుతో మృతి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ తలారి తిరుపతి అంత్యక్రియలకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, ఐపీఎస్‌ హాజరై నివాళులర్పించారు. తిరుపతి మృతితో పోలీస్‌ శాఖలో విషాదం నెలకొంది.రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించిన హెడ్‌ కానిస్టేబుల్‌ తలారి తిరుపతి (1549) ప్రస్తుతం ఆర్మూర్‌ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

మంగళవారం ఆయన ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను బుధవారం ఆర్మూర్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా అంత్యక్రియలకు హాజరైన సీపీ సాయి చైతన్య తిరుపతి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ విషాద సమయంలో పోలీస్‌ శాఖ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.తిరుపతి మృతి పోలీస్‌ శాఖకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీపీ ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ, బోధన్‌ రూరల్‌ సీఐ విజయబాబు, రెంజల్‌ ఎస్‌ఐ ఎం. గంగాధర్‌, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షకీల్‌ పాషా, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments