ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరి జరిగింది. ఓ ఇంట్లో 20 తులాల బంగారం, సుమారు ముప్పై వేల రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు.
ఆరవ టౌన్ సమీపంలో గల షాద్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ లా వివరాల ప్రకారం. ఆదివారం షాద్ నగర్ లో గల ఓ కుటుంబీకులు ఆరోగ్యం బాగా లేదనీ ఆసుపత్రి కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి ఒంటిగంట అయ్యింది.
వచ్చేసరికి ఇంట్లో ఉన్న బంగారం మాయమవడంతో భాదితులు పోలీసులకు సమాచారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.