Sunday, March 29, 2026
HomeCRIMEగాయత్రీనగర్‌లో వ్యభిచార గృహంపై సీసీఎస్‌ పోలీసుల దాడి..విటులు, నిర్వాహకులతో సహా నలుగురి అరెస్టు

గాయత్రీనగర్‌లో వ్యభిచార గృహంపై సీసీఎస్‌ పోలీసుల దాడి..విటులు, నిర్వాహకులతో సహా నలుగురి అరెస్టు

నగరంలోని ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై శనివారం సీసీఎస్‌ పోలీసులు మెరుపు దాడి చేశారు. నగర పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ (ఇన్‌ఛార్జ్) మస్తాన్ వలీ పర్యవేక్షణలో సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు.


గాయత్రీనగర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో ఇద్దరు విటులను, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ. 5,690 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును ఫోర్త్‌టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు అప్పగించారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!